దేశంలోకి మహమ్మారి కరోనా వచ్చిన స్టార్టింగ్ సమయంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి.
రాష్ట్రాలకు సరికొత్త మార్గదర్శకాలు అప్పట్లో ఆదేశించడం మనం చూశాం.వైరస్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లకుండా.
వైరస్ ప్రభావం బట్టి రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ లు ఏర్పాటు చేశారు.ఇదే తరుణంలో వైరస్ సోకిన వ్యక్తికి ఐసోలేషన్ కింద రెండు వారాలపాటు ఇంటికే పరిమితం అప్పట్లో చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ … వల్ల చాలామంది దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.ఈ తరుణంలో తాజాగా కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది.కరోనా బారిన పడిన వ్యక్తి ఐసోలేషన్ కింద ఏడురోజులు ఇంటికి పరిమితం కావాలని కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.గతంలో 14 రోజులు ఉండే సమయాన్ని తాజాగా కేంద్రం ఏడు రోజులకు కుదించింది.
అయితే ఐసోలేషన్ లో ఉన్న సమయంలో మూడు రోజుల పాటు ఎటువంటి జ్వరం లేకపోతే గనుక.ఐసోలేషన్ టైం అయిపోయినట్లే.అంటూ.తాజాగా కేంద్రం ఐసోలేషన్ కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.