మొదటిసారి అలాంటి సాహసం చేస్తున్న ఎన్టీఆర్.. హిట్ కొడుతాడా?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.

 Junior Ntr Two Movies Releasing At A Same Time Details, Junior Ntr, Buchi Babu,-TeluguStop.com

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అరవింద సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి మరొక సినిమా రాలేదు.

ఆ సినిమా పూర్తి అయిన తరువాత ఆ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో లీనమై పోయాడు.ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది.

కరోనా మహమ్మారి వల్ల పలుమార్లు షూటింగ్ కూడా వాయిదా పడింది.ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇకపోతే ఈ ఏడాది జనవరి 7న విడుదల అవుతుంది అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.కానీ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు రాజమౌళి నిరాశ పరిచాడు.

అయితే ప్రస్తుతం రోజు రోజుకి సమాజంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగి పోతుండటంతో ఈ సినిమాను మరోసారి వాయిదా వేశారు.ఈ సినిమా మరొక సారి వాయిదా పడడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

ఇకపోతే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు శివ దర్శకత్వంలో తన 30వ  సినిమాను మొదలు పెట్టబోతున్నారు.

అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా త్వరలోనే ఘనంగా మొదలు పెట్టబోతున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.ఇప్పుడైనా సినిమాతో సెన్సేషన్ హిట్ ను అందుకున్న బుచ్చిబాబు గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక బుచ్చిబాబు స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి డ్రాఫ్ట్ రెడీ చేసి ఎన్టీఆర్ కు వినిపించడం కూడా అయిపోయిందట.

అందుకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది అని తెలుస్తోంది.అయితే ఆ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న విషయంలో కాస్త అయోమయంగా ఉండిపోయారట.జూనియర్ ఎన్టీఆర్ శివ సినిమాతో పాటుగా, బుచ్చిబాబు సినిమాను కూడా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట.

కొరటాల శివ సినిమా తెరకెక్కిన ఒకటి రెండు నెలల తరువాత బుచ్చిబాబు సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది.మరి ఒకే సారి రెండు సినిమాలు చేస్తూ సాహసం చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్.

అనుకున్న విధంగా సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube