బ్రహ్మాస్త్ర గురించి అలా చెప్పిన కరణ్ జోహార్.. ఆ కథ వింటే అబ్బో!

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవలే కరణ్ జోహార్ బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

 Karan Johar Has Said Actors Ranbir Kapoor And Alia Bhatt Have Given Seven Years-TeluguStop.com

ఈ సినిమా 2022 సెప్టెంబర్ లో విడుదల కానుంది.ఇక ఎన్నో అవాంతరాలు అడ్డంకులు తరువాత ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ దాకా వచ్చింది.

ఇక ఈ సందర్భంగా ఈ బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన సుదీర్ఘ ప్రయాణానికి ఒకసారి గుర్తు చేసుకున్నాడు కరణ్ జోహార్.ఈ క్రమంలోనే ఏడు ఏళ్లు వెనక్కి వెళ్ళిన కరణ్ మొదట అలియా గురించి ప్రస్తావించాడు.

అప్పట్లో అలియా చాలా చిన్న పిల్ల అంటూ సరదాగా కామెంట్ చేశాడు.నిజంగానే బాలీవుడ్ కి న్యూ కమ్మర్ గా ఎంట్రీ ఇచ్చిన అలియా వయసు అప్పటికి 21 ఏళ్ళు.

అలా అలియా భట్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే బ్రహ్మాస్త్ర సినిమాకు సైన్ చేసిందట.అంటే అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాకు సైన్ చేసి దాదాపుగా ఏడు ఏళ్లు కావస్తోంది.

ఈ సినిమా అనేక చర్చలు, వాయిదాలు అనుమానాలు అన్నీ దాటుకుని ఎట్టకేలకు రిలీజ్ దాకా వచ్చింది.ఇక ఈ సినిమా 2022 సెప్టెంబర్ లో విడుదల కానుంది.

అప్పటికి 28 ఏళ్ల అలియా కి 29 ఏళ్లు కూడా వస్తాయి అని కరణ్ జోహార్ తెలిపారు.

Telugu Alia Bhatt, Bollywood, Karan Johar, Ranbir Kapoor-Movie

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాకి రణ్ బీర్ కపూర్, అలియా భట్ మరొక మాట లేకుండా ఏడేళ్ళపాటు మాట ఇచ్చారని కరణ్ జోహార్ తెలిపారు.అదేవిధంగా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు వారి డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారని, అంతే కానీ ఈ ప్రాజెక్ట్ పై నమ్మకం కోల్పోయి లేదని తెలిపాడు.ఇక ఆలియా కూడా ఈ బ్రహ్మాస్త్ర సినిమాతో పాటే పెరిగి పెద్దదయింది.

సినిమాకు సైన్ చేసినప్పుడు 21 ఏళ్ళు, ప్రస్తుతం ఇప్పుడు తనకి 28 ఏళ్లు.ఇక సినిమా రిలీజ్ అయ్యే నాటికి తనకు 29 ఏళ్లు ఉంటాయి అని కరణ్ జోహార్ తెలిపారు.

ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు, అయాన్ ముఖర్జీ ఏడేళ్లుగా తాపత్రయ పడ్డారని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube