ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈమె సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
మొదట బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.
ఈమె తమిళంలో ఈశ్వరన్, భూమి లాంటి సినిమాల్లో నటించింది.
ఇకపోతే ప్రస్తుతం హీరో ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.
అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నటించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించి ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇందులో హీరో విజయ్ నిజ జీవితంలోనూ ఒక మాస్టర్ అని నిధి అగర్వాల్ తెలిపింది.హీరో శింబు గోల్డెన్ హాట్ పర్సన్ అంటూ అతని పొగిడింది.

దీనితో శింబు అభిమానులు ప్రస్తుతం ఆ ట్వీట్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఇకపోతే నిధి అగర్వాల్ విషయానికి వస్తే ఈమె నిత్యం తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటుంది.నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ను డామినేట్ చేస్తూ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది నిధి.ఈమె మొదట బాలీవుడ్ లో విడుదల అయిన మున్నా మైఖేల్ సినిమా తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.సోషల్ మీడియా వేదికగా ఈమె అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.