బీజేపీ పై వైసీపీ దూకుడు ! జగన్ డిసైడ్ అయినట్టేనా ? 

కేంద్ర అధికార పార్టీ బీజేపీ విషయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ  అన్ని మొహమాటాలు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.బీజేపీ పై గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ అనేక విమర్శలు వైసీపీ నాయకులు చేస్తున్నారు.

 Bjp, Tdp, Somu Veerraju, Perni Nani, Ap Transport Minister, Rk Roja, Nagari Mla,-TeluguStop.com

ఇక బీజేపీ సైతం అంతే స్థాయిలో వైసీపీ పై ఎదురుదాడి చేస్తూ, ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.గత కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనేక స్టేట్మెంట్లు ఇస్తూ, ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు.

బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తే క్వార్టర్ 50 రూపాయలకే అందిస్తామంటూ ప్రకటించారు.దీనిపై వైసీపీ నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తూ బీజేపీ పై విరుచుకుపడ్డారు.

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సైతం బీజేపీ పై విమర్శలు చేశారు.బీజేపీ, టీడీపీ ల పై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని,  ప్రత్యేక హోదా,  విభజన అంశాలను అమలు చేయకుండా బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని రోజా దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ సభ పైన రోజా విమర్శించారు.అసలు ఈ సమయంలో బీజేపీ సభలు నిర్వహించి ఏం సాధిస్తుందని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మాటేమిటి అంటూ రోజా ప్రశ్నించారు.అలాగే మంత్రి పేర్ని నాని సైతం బీజేపీపై గట్టిగా కౌంటర్లు వేశారు.

బీజేపీ నాయకులవి ఓట్ల రాజకీయాల ని , చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.  పెట్రోల్,  డీజిల్ ధరల పెరుగుదల పై బీజేపీ నేతలు బాధపడాలని , పెరుగుతున్న రేట్లపై బీజేపీ నేతలకు బాధ లేదా అని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదని , పెట్రోల్ డీజిల్ రేట్లపై మాట్లాడాలని కామెంట్ చేశారు.జాతీయ పార్టీలకు ఒక విధానం ఉంటుందని , కానీ విచిత్రంగా ప్రాంతీయ పార్టీ టీడీపీ అడుగుజాడల్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు.

అసలు బీజేపీని జాతీయ పార్టీ అనాలా, ప్రాంతీయ పార్టీ అనాలా  అంటూ పేర్ని నాని కామెంట్ చేశారు.దీనిపై సోము వీర్రాజు కామెంట్ చేశారు.తమ్ముడు పేర్ని నాని కి వినమ్రంగా చెబుతున్న,  మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి.పేర్ని నాని ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇక బీజేపీ విషయంలో వైసీపీ ఎదురు దాడి చేయాలని , టీడీపీ, జనసేన తరహాలోనే బీజేపీ పైన గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అవ్వడం తోనే మంత్రి పేర్ని నాని,  రోజా, కొడాలి నాని వంటి వారు రంగంలోకి దిగినట్టు కనిపిస్తున్నారు.

YCP leaders Serious on BJP Comments #APPolitics

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube