తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగి రోజురోజుకూ ఆడియెన్స్ ను పెంచుకుంటూ పోతున్నాడు ధనుష్.ఈయన సినిమాలంటే తమిళ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
వరుసగా హిట్స్ కొడుతూ దూసుకు పోతున్నాడు.ధనుష్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి.
కానీ ఈసారి ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.
డైరెక్ట్ తెలుగు సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ధనుష్ తెలుగు సినిమాను ఒప్పుకున్నాడు.
ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైట్ మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు.
ఇక ఈ సినిమాను తొలిప్రేమ సినిమా తీసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనుంది.
సూర్యదేవర నాగ వంశి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్టు కూడా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
వెంకీ అట్లూరి ఇటీవలే నితిన్ తో రంగ్ దే సినిమాను తెరకెక్కించాడు.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక ప్లాప్ అయ్యింది.రంగ్ దే సినిమాతో ప్లాప్ చవిచూసిన వెంకీ అట్లూరి ఇప్పుడు ధనుష్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.మరి ధనుష్ మొదటిసారి చేస్తున్న తెలుగు సినిమా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.