ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో లక్ష్మీ పార్వతి అలా చేశారు.. పూజిత కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటీమణులలో ఒకరైన పూజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తనకు రావాల్సిన పారితోషికం చాలానే ఉందని పూజిత తెలిపారు.

 Actress Poojitha Shocking Comments About Senior Ntr Wife Laxmi Parvathi , Inter-TeluguStop.com

ఒక నిర్మాత తనకు రావాల్సిన పారితోషికం అడిగితే కష్టాల్లో ఉన్నానని ఎప్పుడూ చెబుతాడని పూజిత అన్నారు.అయితే ఆ నిర్మాత జ్యువెలరీ షాప్ లో లేదా బ్యాంక్ లో ఎక్కువగా కనిపిస్తాడని పూజిత వెల్లడించారు.

నేను ఎక్కువ చేసినా తక్కువే తీసుకున్నానని పూజిత అన్నారు.ప్రస్తుత నటీనటులు తెలివైన వాళ్లని పూజిత పేర్కొన్నారు.కేంద్రం నుంచి వచ్చిన పదవి కొంతమంది అడ్డుకోవడం వల్ల రాలేదని పూజిత తెలిపారు.కేంద్రం పేదవాళ్లు, ఆడవాళ్ల కోసం పని చేస్తున్నానని ఓకే చెప్పిందని ఆ పదవి కోసం ఫండ్స్ కూడా రిలీజయ్యాయని పూజిత అన్నారు.

తాను బయట కూర్చుని కూడా పనులు చేయగలనని పూజిత చెప్పుకొచ్చారు.

అబ్దుల్ కలాం  తన లైఫ్ మారడానికి ఒక విధంగా కారణమని పూజిత అన్నారు.

ఎక్కువ సినిమాల్లో నటించాలని తనకు ఉందని పూజిత పేర్కొంది.మంచి పాత్ర వస్తే సీరియల్ లో చేస్తానని పూజిత వెల్లడించారు.

ఆడదాని లైఫ్ కష్టాల కోసమా అని పూజిత ప్రశ్నించారు.ఒక సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ భార్య పాత్రలో తాను నటించానని నిజంగా ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో తాను ఆయన ఇంటికి వెళ్లానని పూజిత పేర్కొన్నారు.

Telugu Laxmi Parvati, Poojitha, Senior Ntr-Movie

ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో లక్ష్మీ పార్వతి గారు చక్కగా కూర్చుని టీ తాగారని పీవీ నరసింహారావు గారు వచ్చిన వెంటనే శవంపై పడిపోయి ఏడ్చారని పూజిత చెప్పుకొచ్చారు.అదే సీన్ తాను చేయడంతో కేసు పెడుతున్నామని, బాంబులతో లేపేస్తామని బెదిరించారని పూజిత పేర్కొన్నారు.ఆ తర్వాత లక్ష్మీపార్వతి తనతో సరిగ్గా మాట్లాడలేదని పూజిత పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube