ఓన‌ర్‌కు సాయం చేసేందుకు ఈ కుక్క ఏం చేసిందో చూస్తే..

విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నమ్మకాన్ని డాగ్స్ అస్సలు వమ్ము చేయవు.

 If You Look At What This Dog Did To Help Owner Dog, Viral Video, Tires , Viral-TeluguStop.com

ఒకసారి ఇంత తిండి పెడితే లైఫ్ లాంగ్ సేవ చేస్తుంటుంది కుక్క.ఇకపోతే కుక్కలు చుట్టు ఉండే వాతావరణాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి.

ఒకసారి డాగ్స్‌ను ట్రైన్ చేస్తే అవి చెప్పిన పనిని చేస్తూనే ఉంటాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

తాజా వీడియోలో ఈ కుక్క ఒకేసారి నాలుగు టైర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.ఆ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఓనర్ కి సాయం చేసేందుకుగాను కుక్క ఎంతగానో ప్రయత్నిస్తున్నదని అంటున్నారు.

వీడియో వివరాల్లోకెళితే.

ఓ ఇంటిలోని పాత టైర్లను వేరే చోటుకు తరలించాల్సి వస్తుంది.ఈ క్రమంలోనే ఇంటి ఓనర్ ఓ నాలుగు టైర్లు తెచ్చి అరుగు మీద పెట్టాడు.

అలా పనులు చేస్తున్న టైంలో టైర్లను తీసుకొచ్చి ఓనర్ కు సాయం చేసేందుకుగాను డాగ్ ప్రయత్నిస్తోంది.నాలుగు టైర్లను మోసుకుపోవాలనుకునే ప్రయత్నం చేసి ఆశ్చర్యపరిచింది.

మొత్తంగా తన విధేయతను చాటుకుంది ఆ డాగ్.

అలా కుక్క నాలుగు టైర్లు తీసుకెళ్లేందుకుగాను ప్లాన్ చేసుకున్న విధానం, టెక్నిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.మనుషుల లాగానే కుక్క కూడా ఆలోచిస్తోందని మీకు అర్థమవుతుంది.ఇందుకు సంబంధించిన వీడియో తొలుత రెడ్డిట్ లో ఓ యూజర్ పోస్ట్ చేయగా, అది తెగ వైరలవుతోంది.

వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘అది అందమైన కుక్క మాత్రమే కాదు తెలివైనది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కుక్క చాలా కష్టపడిపోతున్నదని, చాలా గొప్పగా సాయం చేసేందుకు ప్రయత్నించిందని ఇటువంటి కుక్కలను ప్రతీ ఒక్కరు పెంచుకోవాలని కొందరు పోస్టులు పెడుతున్నారు.మొత్తంగా కుక్క అందరి హృదయాలు దోచుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు.