టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు కెరీర్ ను కొనసాగిస్తున్నారు.మహేష్ బాబు నటనకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్న మహేష్ జూబ్లీహిల్స్ లో కొత్త ఫ్లాటును కొనుగోలు చేశారు.హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ కు అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుంది.మహేష్ బాబు కొనుగోలు చేసిన ఫ్లాట్ విలువ 26 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
1442 గజాల ఫ్లాట్ ను మహేష్ బాబు కొనుగోలు చేశారని యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫ్లాటును అమ్మారని తెలుస్తోంది.2021 సంవత్సరం నవంబర్ నెల 17వ తేదీన ఈ లావాదేవీ జరిగిందని సమాచారం.మహేష్ బాబు ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసినందుకు కోటీ 43 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ, 39 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ డ్యూటీ చెల్లించినట్టు తెలుస్తోంది.
కరోనా సమయంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదొడుకులకు లోనైంది.
అయితే బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో స్టార్టప్స్ ఎక్కువగా ఉండటంతో తక్కువ సమయంలోనే రియల్ ఎస్టేట్ పరిస్థితులు చక్కబడ్డాయి.
కరోనా తర్వాత ఈ నగరాలలో భూముల ధరలు 5 శాతం నుంచి 6 శాతం వరకు పెరగడం గమనార్హం.సాధారణంగా జూబ్లీహిల్స్ లో 1,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఫ్లాట్స్ ఉంటాయి.ఈ ఏరియాలో గజం భూమి విలువ లక్షన్నర రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంది.
ఈ ఇంటి గత యజమాని యర్రం విక్రాంత్ రెడ్డి మొదట పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటిని నిర్మించాలని అనుకున్నాడని అయితే ఆ తర్వాత నిర్మాణ పనులు చేపట్టకుండానే యర్రం విక్రాంత్ రెడ్డి మహేష్ బాబుకు ఇంటిని అమ్మారని సమాచారం.అయితే మహేష్ బాబు మాత్రం ఈ ఇంటి గురించి ఇప్పటివరకు స్పందించలేదు.