బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇన్ని రోజులకు ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ డిసెంబర్ 9న వివాహం చేసుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ వివాహం చేసుకోబోతున్న విషయం అధికారికంగా ప్రకటన రాకపోయినా మీడియా మాత్రం డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం చేస్తుంది.
రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని టాక్ అయితే బయటకు వచ్చింది.
అయితే ఇన్ని వార్తలు బయటకు వస్తున్న కూడా వీరిద్దరూ మాత్రం నోరు తెరవకపోవడం వల్ల ఏ విషయం స్పష్టంగా తెలియడం లేదు.
ఇక తాజాగా వీరిద్దరి పెళ్లి వార్తపై కియారా అద్వానీ స్పందించారు.
నిన్న ఢీల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి కియారా అద్వానీ హాజరయ్యారు.ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు.అక్కడ మీడియా కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లి గురించి అడిగారు.
ఆ విషయంపై కియారా స్పందిస్తూ… ”నిజంగానే.? వాళ్ళ పెళ్లి గురించిన వార్తలు నేను కూడా విన్నాను.కానీ నాకేం తెలియదు.నన్నైతే వాళ్ళ పెళ్ళికి ఇప్పటి వరకు పిలువలేదు.” అని చెప్పడంతో అందరు మళ్ళీ ఆలోచనలో పడ్డారు.ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్కరికి కూడా ఆహ్వానం అందలేదని తెలుస్తుంది.
మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పి చెప్తే కానీ ఏ విషయం బయటకు రాదు.