టాలీవుడ్ లో మునుపెన్నడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎప్పుడు గెస్టులుగా రాని.
చూడని కాంబోలని త్వరలోనే చూడబోతున్నాం.గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి.
ఎప్పుడు బయట విషయాలను పట్టించుకోని బాలయ్య హోస్ట్ గా రావడం అందరికి షాకింగ్ అయితే అది కూడా మెగా కుటుంబానికి చెందిన ఆహా ఒటిటి సంస్థ ద్వారా రావడం తెలుగు ప్రేక్షకులు ఇంకా నమ్మలేకపోతున్నారు.
ఇక అప్పటి నుండి అల్లు కుటుంబం, బాలయ్య ఇద్దరు బాగా కలిసి పోయినట్టే కనిపిస్తుంది.
ఎలా అంటే బాలయ్య అఖండ సినిమాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హోస్ట్ గా రావడం పెద్ద విశేషంగా అందరు దీని గురించి మాట్లాడుకున్నారు.ఇక అప్పటి నుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లెక్కలు అన్ని తారుమారు అయ్యాయి.
కొత్త కొత్త కాంబోలు తెర మీదకు వస్తున్నాయి.ఇలా కొత్త కాంబో లను సెట్ చేసి మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యాలని చేస్తున్నారు.
తాజాగా తెరమీదకు మరొక రెండు కొత్త కాంబోల పేర్లు వినిపిస్తున్నాయి.ఎప్పుడు మన టాలీవుడ్ లో చూడని నందమూరి, మెగా ఫ్యామిలీలు కలిసి పోతున్నాయి.వీరి కాంబో లను కొత్తగా సెట్ చేసి అభిమానులకు మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.ఇప్పటి వరకు మెగా ఈవెంట్స్ కు ఎప్పుడు మెగా కుటుంబం నుండి మాత్రమే గెస్టులుగా వచ్చేవారు.
ఇక ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
మెగా సినిమాకు నందమూరి హీరో, నందమూరి సినిమాకు మెగా హీరోలు గెస్టులుగా తెస్తున్నారు మేకర్స్.తాజాగా రెండు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే జరగనుంది.
దీనికి బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడనే లేటెస్ట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలయ్య అఖండ సినిమాకు బన్నీ గెస్ట్ గా వచ్చి మరింత హుషారుని నింపి అల్లు అర్జున్ ఋణం తీర్చుకోవాలని బాలయ్య అనుకుంటున్నాడట.అందుకే బన్నీ పుష్ప ఈవెంట్ కు గెస్ట్ గా రావాలని అనుకుంటున్నాడని సమాచారం.ఇక మరొక క్రేజీ కాంబో పేరు కూడా వినిపిస్తుంది.
మెగాస్టార్, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీతో వీరిద్దరూ మరింత క్లోజ్ అయ్యారు.
అన్నదమ్ములుగా బాగా కలిసి పోయారు.అందుకే మెగా కాంపౌండ్ మొత్తం ఎన్టీఆర్ పై ప్రేమను చూపిస్తుంది.
దాంతో ఆచార్య సినిమాకు ఎన్టీఆర్ ను పిలవాలని అనుకుంటున్నారట.ఇక ఇక్కడ వేదిక మీద ఎన్టీఆర్, మెగాస్టార్ కలిస్తే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం.
చూడాలి మరి వస్తున్న గాసిప్స్ నిజమో కాదో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాల్సిందే.