గత కొన్నేళ్లుగా తల్లి పాత్రల్లో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటిగా సుధకు పేరుంది.ఒక ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అని తనకు నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు అని సుధ చెప్పుకొచ్చారు.
నాకు చిన్నప్పుడే అన్నలు బౌన్సర్లలా ఉండేవారని సుధ తెలిపారు.నాకు ఏదైనా అవసరం అయితే అన్నయ్యలే తెచ్చేవాళ్లని సుధ పేర్కొన్నారు.
ఫాదర్ కు చిన్ క్యాన్సర్ రావడంతో తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని సుధ అన్నారు.అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ అని సుధ పేర్కొన్నారు.తాను డైమండ్ స్పూన్ తో పుట్టానని సుధ అన్నారు.అమ్మ ప్రోత్సాహం వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని సుధ చెప్పుకొచ్చారు.
ఆస్తి పంపకాలకు సంబంధించి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని సుధ అన్నారు.సొసైటీలో ఏం జరిగిందో తమ ఇంట్లో కూడా అదే జరిగిందని సుధ తెలిపారు.
గతాన్ని తాను గుర్తుంచుకుని భవిష్యత్తులో ముందడుగులు వేస్తున్నానని సుధ అన్నారు.వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకోకూడదని బుద్ధి ఉంటే మోసాలు జరగవని తన జీవితంలో కూడా సావిత్రిగారిలా మోసాలు జరిగాయని సుధ పరోక్షంగా తెలిపారు.గాసిప్స్ మాట్లాడేవాళ్లను తాను కేర్ చేయనని సుధ అన్నారు.నాపై ఈర్ష్య పెట్టుకుంటే వాళ్లకే అల్సర్ వస్తుందని సుధ వెల్లడించారు.
నాకు ఇండస్ట్రీలో బెంగళూరు పద్మ క్లోజ్ అని సుధ పేర్కొన్నారు.బెంగళూరు పద్మతో అన్ని విషయాలను చెప్పుకుంటానని సుధ వెల్లడించారు.ఎక్కడో పుట్టామని దేవుడు కనెక్ట్ చేసి పెట్టాడని సుధ పేర్కొన్నారు.ఇతరుల ఒపీనియన్ తాను చెప్పలేనని సుధ తెలిపారు.తనకు సినిమాల్లో ఎక్కువగా ఏడిపించే క్యారెక్టర్లు వచ్చాయని సుధ పేర్కొన్నారు.అయితే సెట్ లో మాత్రం తాను నవ్వుతూనే ఉంటానని సుధ అన్నారు.