దారుణంగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్.. ఆ తప్పు వల్లేనా?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు సంబంధించి పలు సినిమాల్లో సైతం ప్రస్తావించారు.

 Kartheeka Deepam Serial Trp Rating Downfall Started Details, Kartheeka Deepam, K-TeluguStop.com

ఏ సీరియల్ ను చూడని అభిమానులు సైతం కార్తీకదీపం సీరియల్ ను చూస్తారు.బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

క్రికెట్ మ్యాచ్ లు, బిగ్ బాస్ షో ల కంటే కార్తీకదీపం సీరియల్ కే మంచి రేటింగ్స్ వస్తున్నాయి.ఇతర సీరియళ్లు, సినిమాల కంటే కార్తీకదీపం సీరియల్ కే మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో కార్తీకదీపం పరిస్థితి మారుతోంది.సీరియల్ ను మరీ సాగదీస్తూ ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

గతంలో ఈ సీరియల్ కు 18 నుంచి 21 మధ్య రేటింగ్ వచ్చింది.

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు 14 నుంచి 15 మధ్య రేటింగ్ వస్తోంది.

Telugu Bigg Boss Show, Babu, Downfall, Kartheekadeepam, Karthika Deepam, Monitha

ఇదే విధంగా కార్తీకదీపం సీరియల్ కొనసాగితే భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు.ఈ సీరియల్ ను త్వరగా ముగిస్తే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కార్తీకదీపం టీమ్ ఇకనైనా మేల్కొంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss Show, Babu, Downfall, Kartheekadeepam, Karthika Deepam, Monitha

కథకు సరైన ఎండింగ్ ఇచ్చి సీరియల్ ను ముగించకపోతే ఈ సీరియల్ కు ఇప్పటివరకు ఉన్న మంచి పేరు కూడా పోయే అవకాశం ఉంటుంది.సీరియల్ లో మరింత సాగదీతను కొనసాగిస్తారో లేక దర్శకనిర్మాతలు ఈ సీరియల్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.కథనంలో వేగం పెంచి షాకింగ్ ట్విస్టులు పెడితే మాత్రమే సీరియల్ కు మంచి రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ కు కూడా ఈ సీరియల్ సాగదీత నచ్చడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube