భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులను పునీత్ రాజ్ కుమార్ మరణం బాధ పెట్టిన సంగతి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నడ పవర్ స్టార్ లేరనే వార్తను విని తట్టుకోలేక కర్ణాటకలో పది మంది గుండెపోటుతో చనిపోగా మరో ఐదు మంది ఆత్మహత్య, ఇతర కారణాల వల్ల చనిపోయారు.పునీత్ మరణించి వారం రోజులైనా ఫ్యాన్స్ మాత్రం పునీత్ మరణ వార్త నిజం కాకపోతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ నెల 29వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఆ తర్వాత గంట సమయంలోనే మృతి చెందారు.అయితే పునీత్ రాజ్ కుమార్ చనిపోవడానికి మొదట చికిత్స చేసిన ఫ్యామిలీ డాక్టర్ కారణమని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
పునీత్ రాజ్ కుమార్ నలతగా అనిపించిన వెంటనే ఫ్యామిలీ డాక్టర్ రమణారావును వెళ్లి కలిశారు.రమణారావు పునీత్ కు అన్ని పరీక్షలు నిర్వహించి హార్ట్, బీపీ, షుగర్ అన్నీ నార్మల్ గా ఉన్నాయని చెప్పారు.
అయితే డాక్టర్ పరీక్షలు చేసిన సమయంలో ఈసీజీ రిపోర్ట్ లో తేడా రావడం వల్ల పునీత్ రాజ్ కుమార్ ను ఆస్పత్రిలో చేరాలని సూచించారు.

అయితే రమణారావు పునీత్ రాజ్ కుమార్ కు ప్రాథమిక చికిత్స ఎందుకు చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పునీత్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే డాక్టర్ కనీసం గుర్తించలేరా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పునీత్ మృతి గురించి విచారణ జరపాలని అభిమానులు కోరుతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ కు డాక్టర్ సరైన చికిత్స చేశారా? లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.పునీత్ మృతికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కేవలం గంట వ్యవధిలోనే పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.