తనపై కెసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని హరీష్ రావు నిలబెట్టుకున్నట్టేనా?

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి హరీష్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ట్రబుల్ షూటర్ గా తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

 Did Harish Rao Maintain The Trust Placed In Him By Kcr Harishrao, Huzurabad Bypo-TeluguStop.com

టీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితులలో  ఉన్న సమయంలో అక్కడ హరీష్ రావు కాలు మోపాడంటే  ఇక అక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కొంత కంగారు పడాల్సిందే.ఇలా చాలా సమయాల్లో కెసీఆర్ హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి.

అలా కొడంగల్, నాగార్జున సాగర్ ఇప్పుడు హుజూరాబాద్ ఇలా అన్ని సమయాల్లో టీఆర్ఎస్ ను గెలుపు బాటలో పయనించేందుకు కృషి చేసి, తన వ్యూహాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలుపరచిన పరిస్థితి ఉంది.ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Telugu @cm_kcr, Etela Rajender, Harish Rao, Telangana-Political

ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుండే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించి అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులను ఆకళింపు చేసుకొని తనదైన శైలిలో వ్యూహ రచన రచించి టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగారు.అయితే ఎట్టకేలకు పోలింగ్ ముగిసిన తరుణంలో ఇప్పుడు హరీష్ రావు టీఆర్ఎస్ గెలుపు కోసం పోషించిన పాత్రపై చర్చ నడుస్తోంది.ముఖ్యమంత్రి  కెసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని  హరీష్ రావు నిలబెట్టుకుంటాడా.కెసీఆర్ కు విజయాన్ని దీపావళి కానుకగా అందిస్తారా అంటూ  జోరుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

అయితే టీఆర్ఎస్ గెలిచే అవకాశ ముందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమవుతుండగా, బీజేపీ గెలిచే అవకాశముందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమవుతోంది .ఏది ఏమైనా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే   హరీష్ రావు వ్యూహాలు వందకు వంద శాతం ఫలించాయని మనం అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube