తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న షో జబర్దస్త్.న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు రోజా సెల్వమణి, మనోలు నిర్వహిస్తున్నారు.
ఎంతో మందికి మంచి భవిష్యత్ ను అందిస్తూ, కొత్త వారిని బుల్లితెరకు పరిచయం చేస్తున్న షో జబర్దస్త్.ఈ షో ద్వారానే చాలా మంది హాస్య నటులుగా పేరు తెచ్చుకున్నారు.అందులో ఒకరు అప్పారావు.ఆయన జబర్దస్త్ కు రాకముందు ఉన్న పరిస్థితులను గురించి వివరిస్తూ ఇలా అన్నారు.
తాను జబర్దస్త్ కి రాకముందు ఉద్యోగం చేసానని కమెడియన్ అప్పారావు తెలిపారు.1980 నుంచి 2000 వరకు ఆటో మొబైల్ రంగంలో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసే వాడినని అప్పుడు తను కేవలం 10 వేలు జీతం తీసుకొనే వాడినని ఆయన అన్నారు.ఆ తర్వాత మా గురువు గారు ఫేమస్ ఫిల్మ్ స్టార్ ఏపీ & తెలంగాణలో 140 మందికి కోచింగ్ ఇచ్చినటువంటి ఏకైక కమాండర్ కోచ్ లంకా సత్యానందం మాస్టారు అని ఆయన తెలిపారు.వారి ద్వారా తాను 2000 లో బివి రమణ గారు గౌరీ చిత్ర డైరెక్టర్ తర్వాత తేజ గారు విశాఖపట్నం వచ్చి మమ్మల్ని సెలెక్ట్ చేసారని ఆయన అన్నారు.
దీనికి రామోజీ రావు గారు నిర్మాతగా వ్యవహరించారని, తాను చిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి సత్యానందం మాస్టారు కారణం అని ఆయన గర్వంగా చెప్పారు.
దీనికి ముందు రంగస్థలంపై నాటకాలు వేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడినని అప్పారావు ఈ సందర్భంగా తాను జబర్దస్త్ షో కి రాకముందు ఏం చేసే వారు తెలియజేశారు.ప్రస్తుతం జబర్దస్త్ షోలో కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు పలు సినిమాలలో కూడా కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేస్తున్నారు.ప్రస్తుతం తన కెరీర్ ఎలా ఉండడానికి గల కారణం సత్యానంద మాస్టర్ కారణమని ఆ తర్వాత జబర్దస్త్ తనకి లైఫ్ ఇచ్చిందని అప్పారావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.