ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సినీ ‘ మా ‘ సమరం ముగిసింది.ఎన్నికలు జరిగిన కొన్ని గంటల్లోనే ఫలితాలు కూడా వెల్లడయ్యాయి.
చివరి వరకు ప్రకాష్ రాజ్ గట్టి పోటీ ఇచ్చినట్టు అనిపించినా చివరకి మాత్రం మంచు విష్ణు విజయం సాధించి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.
ఇకపోతే ఈసీ మెంబెర్స్ జాబితాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎక్కువగానే గెలిచినా.
అసలైన పోస్టుకు మాత్రం విష్ణు అర్హత సాధించారు.అధ్యక్ష పీఠంతో పాటు మరికొన్ని కీలకమైన పదవులు సొంతం చేసుకున్నారు.
అనంతరం ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంలో తనకూ, శివ బాలాజీకి మధ్య జరిగిన సంఘటనను నటుడు సమీర్ ఈ విధంగా వివరించారు.గేట్ దగ్గర మంచు విష్ణు ప్యానెల్ వాళ్ళు స్లిప్స్ పంచడం తాను చూశానని, అందుకే తాను కూడా పంచానని ఆయన అన్నారు.అప్పుడు శివ బాలాజీ అక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా గద్దించారని సమీర్ అన్నారు.
దానికి తాను నువ్వొవడివి రా చెప్పడానికి అన్నానని, తనకు ఎప్పటినుంచో శివ బాలాజీతో ఫ్రెండ్షిప్ కొద్దీ అలా అన్నానని ఆయన స్పష్టం చేశారు.ఈరోజు కూడా హగ్ చేస్కోమంటే చేసుకుంటాను.
కానీ పాతికేళ్ల పరిచయం మర్చిపోయి, ఒక 900 ఓట్ల ఎలక్షన్ కోసం అంత దారుణంగా చేంజ్ కావడం తనకు నచ్చలేదని ఆయన తెలిపారు.
ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారి విజన్ నీ మెంబర్స్ మిస్ అయ్యారని సమీర్ అన్నారు.ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనోజ్ లేకపోయి ఉంటే గొడవ ఇంకా పెద్దది అయ్యేదని, అందుకు థ్యాంక్స్ అంటూ సమీర్ చెప్పారు.అదేవిధంగా సమీర్ శివ బాలాజీ గురించి మాట్లాడుతూ శివ బాలాజీ ఎప్పటికైనా నిన్ను నాశనం చేస్తారు అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ సందర్భంగా నటుడు శివ బాలాజీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.