బీజేపీకి త్వ‌ర‌లోనే ఆ విధంగా షాక్ ఇవ్వ‌బోతున్న కేసీఆర్‌..

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్యంగా బీజేపీ బ‌ల‌ప‌డుతోంది.ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ ఆ పార్టీలోకి వెళ్ల‌డంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిపోయింది.

 Kcr Is Going To Give Such A Shock To Bjp Soon, Kcr, Bjp,tg Politics-TeluguStop.com

ఈ ఎన్నిక‌ల్లో గ‌న‌క బీజేపీ గెలిస్తే ఆ పార్టీని ఆప‌డం చాలా క‌ష్టం.ఈ విష‌యం కేసీఆర్ టీమ్ కు బాగా తెలుసు.

అందుకే ఎలాగైనా ఇందులో గెలిచి త‌మ‌కు తిరుగు లేద‌ని, కేసీఆర్‌ను ఎదిరిస్తే ఎవ‌రికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని బుద్ది చెప్పాల‌ని కేసీఆర్ టీమ్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇందుకోసం ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యూహాల‌ను కేసీఆర్ అనుస‌రిస్తున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే కేసీఆర్ ఎన్నో వ్యూహాల‌తో గెలిచేవారు.

అలాంటిది అధికారంలో ఉన్న‌ప్పుడు ఇంకెలా ఆలోచిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

కానీ ఇప్పుడు బీజేపీలోకి మంచి ఇమేజ్ ఉన్న నేత‌లు వెళ్తుండ‌టంతో ఆ పార్టీ రోజురోజుకూ క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది.ఇక ఈట‌ల గ‌న‌క గెలిస్తే కేసీఆర్‌కు పెద్ద చిక్కులే వ‌చ్చిప‌డుతాయి.

పార్టీలో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ఉన్న వారు కూడా బీజేపీ గూటికి వెళ్లే ఛాన్స్ ఉంది.దీంతో బీజేపీ బ‌ల‌ప‌డ‌కుండా ఉండేందుకు కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు.

ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన కొంద‌రు నేతల్ని ఆయ‌న ట‌చ్‌లో ఉంచుకున్న‌ట్టు స‌మాచారం.

Telugu Eetala Rajendar, Huzuraabad, Tg-Telugu Political News

వారంతా ఏ క్ష‌ణంలో అయినా టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారంట‌.బీజేపీలో ప్ర‌ముఖంగా ఉంటున్న కొంద‌రిని పార్టీలోకి తీసుకునేందుకు కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు స‌మాచారం.సెకండ్ గ్రేడ్ నాయ‌కుల‌ను కేసీఆర్ టార్గెట్ చేశార‌ని, వారిని చేర్చుకుంటే బీజేపీకి గ్రౌండ్ లెవ‌ల్లో ప‌ట్టు లేకుండా పోతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారంట‌.

అది కూడా ఉప ఎన్నికకు ముందు అమలు చేసి బీజేపీని దెబ్బ తీసేలా కేసీఆర్ ప్లాన్ వేసిన‌ట్టు చెబుతున్నారు.ఇప్ప‌టికే బీజేపీకి ప‌ట్టు ఉన్న జిల్లాల్లో అక్క‌డ పార్టీకి అండ‌గా ఉంటున్న వారిపై కేసీఆర్ ఫోక‌స్ పెట్టారంట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube