బీస్ట్ నెల్సన్ దర్శకత్వంలో డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్

శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ డాక్టర్‘ .ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9th న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

 Director Nelson Hero Shivakarthikeyan Doctor Movie Releasing On Dasara Season, D-TeluguStop.com

కే.జె.ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు.ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్.

ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్ ‘ చిత్రాన్ని చేస్తున్న నెల్సన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.శివకార్తికేయన్ తో ఇదివరకు మేము తీసిన ‘శక్తి’ అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది.

ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9th న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం.ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం” అన్నారు

Telugu Anirudh Music, Nelson, October, Dasara Season-Movie

డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ- “శివకార్తికేయన్ – అనిరుధ్ కాంబినేషన్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది.డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారు.ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్ లో అక్టోబర్ 9th న విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది.ప్రస్తుతం విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం చేస్తున్నా” అన్నారు.

సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్ : ఆర్.నిర్మల్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube