బీస్ట్ నెల్సన్ దర్శకత్వంలో డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్

శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ' డాక్టర్' .

ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9th న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

కే.జె.

ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు.

ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్.

ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్ ‘ చిత్రాన్ని చేస్తున్న నెల్సన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

శివకార్తికేయన్ తో ఇదివరకు మేము తీసిన 'శక్తి' అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది.

ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9th న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం.

ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం" అన్నారు """/"/ డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ- "శివకార్తికేయన్ - అనిరుధ్ కాంబినేషన్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది.

డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారు.ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్ లో అక్టోబర్ 9th న విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది.ప్రస్తుతం విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం చేస్తున్నా" అన్నారు.

సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్ : ఆర్.నిర్మల్.

మన ప్రేమలన్నీ శృంగారం కోసమే.. ఎప్పుడైనా అమ్మ కోసం ఏడ్చావా.. పూరీ కామెంట్స్ వైరల్!