టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత ఈమధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి తన భర్త నాగచైతన్య నుండి విడాకులు తీసుకుంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది.
ఇక ఈ విషయం గురించి అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ సరిగా స్పందించడం లేదు.ఇక సమంత మాత్రం తనకు ఈ విషయాలు పట్టనట్లే ఉన్నాయని అర్థమవుతుంది.
ఎందుకంటే ఇటీవలే ఒంటరిగా తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా పలు పలు పార్టీలలో కూడా బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం తన సంబంధించిన ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.దీనిని బట్టి సమంత నాగచైతన్యతో కలిసి ఉందనే అనిపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే నిత్యం ఒక్క రోజు కూడా వదలకుండా వర్కౌట్లు చేస్తూ బాగా బిజీగా ఉంటుంది.కానీ తాజాగా తన వర్కౌట్ లకు అంతరాయం కలిగింది.
ఇంతకీ అసలేం జరిగిందంటే.ఇటీవలే సమంత నటించిన ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో తనకు మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ తో పరిచయం ఏర్పడింది.
దీంతో ఆమెతో బాగా క్లోజ్ గా ఉంటుంది.తన ఫ్రెండ్ సాధనతో కలిసి జిమ్ముకి వెళ్ళినట్లు తెలియగా.అందులో తాము బాగా సమయాన్ని వృథా చేసినట్లు తెలుస్తుంది.దీంతో సమంత తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంటూ.తను సీరియస్ గా ప్రారంభించిన వర్కవుట్లు మధ్యలో వదిలేయాల్సి వచ్చింది అంటూ తెలిపింది.
ఇంకేంటి అక్క.ఏం జరిగింది.ఇక నాకు ఈ రోజు ఒక గుణపాఠం తెలిసి వచ్చింది అంటూ ఎప్పుడు సాధనను జిమ్ము కు తీసుకు రావద్దని అర్థమైందని తెలిపింది.
మన లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు మనపై వాళ్ల చెడు ప్రభావం కలుగుతుంది కానీ వాళ్లను వదులుకోలేం అంటూ సమంత పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.