తెలుగు, తమిళ నాట ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిలో దిగ్గజ నటులు ఉండటం విశేషం.తమిళ ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్, తెలుగు, తమిళ భాషల్లో నటించిన జయలలిత, తెలుగులో విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్.
ముగ్గురూ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే.ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వారే.
వీరిల్లో తమిళ ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేశారు.ఆ సినిమా మరేదో కాదు.
ఆలీబాబా 40 దొంగలు.బి.విఠలాచార్య దర్శకత్వంలో గౌతమి పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితమైంది.జానపద సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా 1970లో మంచి జనాదరణ పొందింది.
ఎన్టీఆర్, జయలలిత కెరీర్ లో బాగా పేరు తెచ్చిన సినిమాగా ఆలీబాబా 40 దొంగలు గుర్తింపు పొందింది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
షూటింగ్ టైంకి మేకప్ తో లొకేషన్ లోకి వచ్చేవాడు ఎన్టీఆర్.సినిమా పట్ల ఆయనకు నిబద్ధత అలా ఉండేది.
జయలలిత మాత్రం సరైన టైంకి లొకేషన్ కు వచ్చినా మేకప్ పేరుతో ఆలస్యంగా వచ్చేది.ఆలీబాబా 40 దొంగలు మూవీ విషయంలో మాత్రం అలా జరగకుండా చూసుకునేది.
మిగతా సినిమాలకు, ఈ సినిమాలకు ఏందుకు ఈ తేడా అని అడిగితే.ఎన్టీఆర్ మీద తనకు ఉన్న గౌరవం అని చెప్పేది జయలలిత.
అయితే జయలలిత తీరుకు అప్పట్లో స్టార్ హీరోలు కూడా భయపడేవారు.
అటు తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్, తెలుగు నటసార్వభౌముడు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పేది జయలలిత.పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయం సాధించింది.
గ్రాఫిక్స్ అంటే పెద్దగా తెలియని రోజుల్లో ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.వీరు పడ్డ కష్టానికి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.