ఫైర్ బ్రాండ్ అనే పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చే నటి కంగనా రనౌత్ అనే చెప్పవచ్చు.ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు.
పైగా తాను నటించే సినిమాలు కూడా తనకు తగ్గట్టుగానే ఉన్నాయన్నట్లు అనిపిస్తుంది.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది ఈ హాట్ బ్యూటీ.
తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా ఇండస్ట్రీలో ముక్కుసూటి నటిగా పేరు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ఈమెను స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ విషయంలో హెచ్చరించాడట.
డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలైవి సినిమాలో టైటిల్ పాత్రలో నటించింది కంగనారనౌత్.ఈ సినిమా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రలో తెరకెక్కనుంది.ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటించగా.ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది.
ఇక ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందించాడు.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది.
ఇందులో కంగనా రనౌత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఇక ఈ ఈవెంట్ లో విజయేంద్రప్రసాద్ కంగనా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఈ సినిమాలో జయలలిత పాత్రకు కంగనా సూట్ అవుతుందని తానే అన్నారట.కానీ ఈ మూవీలో కంగనాను నటించవద్దని హెచ్చరించాడట విజయేంద్రప్రసాద్.
కంగనా కూడా తనకు జయలలిత తెలుసని కానీ తమిళనాడు పాలిటిక్స్ గురించి తనకు తెలియదని చెప్పడంతో.వెంటనే ఆయన ఈ సినిమాలో నువ్వు నటించవద్దని.నువ్వు నీలాగే ఉండు అని అన్నాడట.ఇక జయలలిత పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ అయితే.బాలీవుడ్ ఇండస్ట్రీ లో కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అని పొగిడాడు.ఇక ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది.