తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల అనూహ్యంగా వచ్చిందని అంతా అనుకున్నారు.వాస్తవానికి ఆమె ఓ పక్క ప్లాన్ ప్రకారమే పక్కా వ్యూహాలతోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆమె తన పార్టీని పరుగులు పెట్టించేందుకు నిరుద్యోగుల తరఫున దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఇందులో భాగంగా ఆమె ప్రతి మంగళవారం కూడా ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల తరఫున దీక్షలు చేస్తోంది.
అయితే ఇంత చేస్తున్నా కూడా తమ పార్టీకి మాత్రం వరుష షాక్‌లు తప్పట్లేదు.ఒక్కరంటే ఒక్క పెద్ద లీడర్ కూడా లేదు ఆమె పార్టీలో.
ఇక నిన్న మొన్నటి వరకు చెప్పుకోదగ్గ లీడర్‌గా షర్మిల తర్వాత పార్టీని నడిపించిన ఇందిరా శోభన్ కూడా రాజీనామా చేయడంతో ఆమెకు మరింత పెద్ద షాక్ తగిలింది.అయితే ఈ క్రమంలోనే తన పార్టీ కోసం రాజకీయ వ్యూహ కర్త అయిన ప్రశాంత్ కిషోర్ ను దించుతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆయన కూడా సెప్టెంబర్ 1నుంచే యాక్షన్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఇందుకోసం పక్కా ప్లాన్ కూడా చేస్తున్నాయంట లోటస్ పాండ్ వర్గాలు.ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఆయన రాకతో పార్టీలో కొత్త ఊపు వస్తోందని అంతా అనుకుంటున్నారు.ఇక షర్మిల కూడా ఇది అనూహ్య నిర్ణయం కాదని గతంలోనే ఆయన సలహాలు తీసుకుంటే తప్పేంటని కూడా చెప్పేశారు.ఈ మాటలను బట్టి తెలంగాణలో పార్టీ పెట్టకముందే ఆమె ప్రశాంత్ కిషోర్ తో ఈ విధమైన రాజీకీయాలు జరిపినట్టు తెలుస్తోంది.
అంటే మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంటరవుతున్నాడన్న మాట.మరి అసలు ఉనికే లేని షర్మిల పార్టీని ప్రశాంత్ ఏ మేరకు నడిపిస్తారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
చూడాలి మరి ఏం జరుగుతుందో.