అంబులెన్సులో యువ‌కులు చేసిన ప‌ని తెలిస్తే..

అనుకోకుండా ఏదేని యాక్సిడెంట్ లేదా ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే అందరికీ గుర్తొచ్చేది అంబులెన్స్ 108 నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు కుయ్.కుయ్.

 If You Know The Work Done By The Youth In The Ambulance Ambulance, Viral News ,-TeluguStop.com

అంటూ అతివేగంగా ఉరికొస్తుంది అంబులెన్స్.ఇక సదరు అంబులెన్స్‌ ప్రాణాలు కాపాడే సంజీవనిలా సాయం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎమర్జెన్సీ టైంలో డాక్టర్స్ వద్దకు పేషెంట్స్‌ను అంబులెన్స్ తీసుకెళ్తుంది.ఇకపోతే ఈ అంబులెన్స్‌లకు రోడ్లపైన దారివ్వాలనే నిబంధన కూడా ఉంది.

ఈ క్రమంలోనే అంబులెన్స్ వచ్చిందంటే చాలు ఇంతర వాహనాలు పక్కకు తప్పుకుంటాయి.అంబులెన్స్‌కు దారి ఇచ్చి పక్కకు జరుగుతుంటారు వాహనదారులు అలాంటి సంఘటనలు మనం చూడొచ్చు.

కాగా, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వెహికల్స్ అయిన అంబులెన్సులను ఆకతాయిలు సంబురాల కోసం యూజ్ చేశారు.ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేలప్పలయంలో కొంతమంది యువకులు క్రికెట్‌లో గెలిచిన సందర్భంగా అంబులెన్సుల్లో ఊరేగారు.స్ధానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌లో విక్టరీ సాధించిన సందర్భంగా ఐదు అంబులెన్స్‌ వెహికల్స్‌లో గెలిచిన ట్రోఫిని పెట్టి హంగమా చేశారు.

రోగుల కోసం వినియోగించే వెహికల్‌ను ఇలా వాడటం‌పై నెటిజెన్లు పైర్ అవుతున్నారు.సంబురాలు చేసుకోవడానికి మీకు వేరే వెహికల్స్ దొరకలేదా అంటూ మండిపడుతున్నారు.సదరు యువకులు ఆకతాయిలు మాత్రమే కాదు కామన్‌సెన్స్ లేని వారని పేర్కొంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.విజయ యాత్రకు ప్రాముఖ్యత కలిగిన అంబులెన్సులను వాడే ముందుర కొంచెమైనా ఆలోచించాల్సి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Telugu Ambulance, Tamilnadu-Latest News - Telugu

ఈ క్రమంలోనే బాధ్యతా రహితంగా వ్యవహరించిన ఈ యువకులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అంబులెన్సుల్లో వాళ్లు తిరుగుతూ సంబురాలు చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ నేపథ్యంలో ఐదు అంబులెన్స్ డ్రైవర్స్, యువకులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.కేసు దర్యాప్తు చేసి త్వరలోని వారిని అదుపులోకి తీసుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube