అధరాలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.ఎందుకంటే, ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పెదవులు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
అయితే కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్ వాడటం, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలిగించక పోవడం, పోషకాల లోపం, శరీరంలో అధిక వేడి, ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం ఇలా రకరకాల కారణాల వల్ల పెదవులు నల్లగా, నిర్జీవంగా మారు తుంటాయి.ఇక ఈ సమస్యల నుంచి ఎలా బయట పడాలో తెలియక చాలా మంది వర్రీ అయిపోతుంటారు.
అయితే ఇంట్లోనే కొన్ని సింపుల్ రెమిడీస్‌ను పాటిస్తే సులభంగా అధరాలను అందంగా మెరిపించుకోవచ్చు.,/br>
ముందుగా కొన్ని దానిమ్మ గింజలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు బౌల్ తీసుకుని రెండు స్పూన్ల దానిమ్మ రసం, ఒక స్పూన్ పాల మీగడ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో రుద్దు కుంటూ లిప్స్‌ను క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే అధరాలు అందగా, మృదువుగా మారతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఒక స్పూన్ లెమెన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి వేళ్లతో సర్కిలర్ మోషన్‌లో రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత బాగా డ్రై అవ్వనిచ్చి అప్పుడు కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే పెదాలు గులాబీ రంగులోకి మారి కాంతి వంతంగా మెరుస్తాయి.
ఈ టిప్స్‌తో పాటుగా పెదవులకు సహజ సిద్ధమైన లిప్ మాస్క్‌లు, లిప్ బామ్‌లు యూజ్ చేయాలి.
మరియు వారానికి ఒక సారి టూత్ బ్రెష్‌తోను లిప్స్‌ను రుద్దుకోవాలి.ఇలా చేస్తే మృతకణాలు పోయి లిప్స్ గ్లోగా మారతాయి.
ఇక రాత్రి నిద్రించే ముందే లిప్ స్టిక్‌ను పూర్తిగా తొలిగించి వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆ తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకోవాలి.