టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన ‘అంధాదున్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇందులో నితిన్ తమన్నా ఇద్దరు ఉన్నారు.నితిన్ సం గ్లాసెస్ పెట్టుకుని బ్లేజర్ వేసుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.తమన్నా ఈ యూత్ స్టార్ పక్కన హాట్ విలన్ రోల్ లుక్ లో తుపాకీ పట్టుకుని హాట్ ఫోజ్ ఇచ్చింది.ఈ పోస్టర్ లో తమన్నా లుక్ అదిరి పోయిందనే చెప్పాలి.
ఇంత వరకు ఈ నుండి తమన్నా పాత్రపై పెద్దగా ఏ విషయం బయటకు రాలేదు.కానీ ఈ రోజు స్పెషల్ గా పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.అయితే తమన్నా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందని సమాచారం.త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటి నుండో స్టార్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ విడుదల అయి బాగానే ఆకట్టుకున్నాయి.,/br>
క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.ఈ సినిమా త్వరలోనే ఓటిటీ సంస్థ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఇది ఇలా ఉంటే.ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.
మరి చూడాలి మాస్ట్రో నితిన్ కెరీర్ కు ఎలా ప్లస్ అవుతుందో.