ప్రధాని మోడీ ఫోటో లేదని సీరియస్ అయిన కేంద్ర ఆర్థిక మంత్రి..!!

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ ప్రాంతంలో పర్యటన చేపట్టడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా పంచాయతీ పరిధిలో ఉండే బంగారయ్య పేటలో ఉన్న రేషన్ డిపో నీ సందర్శించిన నిర్మల సీతారామన్.

 Central Minister Serious Comments Modi, Nirmala Sitharaman,latest News-TeluguStop.com

డిపోలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో… రేషన్ డీలర్ల పై అదేరీతిలో అధికారులపై సీరియస్ అయ్యారు.కేంద్ర ప్రభుత్వం “గరీబ్ కళ్యాణ్ అన్న యోజన” స్కీం కింద కేంద్రం బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతటి మంచి కార్యక్రమం కేంద్రం చేస్తున్న నేపథ్యంలో.మోడీ ఫోటో రేషన్ షాప్ లో లేకపోవడం పై నిర్మల సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ ఫోటో లేకుండా ప్రజలకు బియ్యం ఎలా ఇస్తారని.అన్నట్టుగా డీలర్ నీ ఆమె ప్రశ్నించడం జరిగింది.

Telugu Ap, Modi, Tallapalem Dipo-Telugu Political News

ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటికి రేషన్ అందిస్తున్నట్లు.నిర్మల సీతారామన్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎందుకు అంటూ మరింతగా స్థానిక నాయకుల పై సీరియస్ అయ్యారు.ఆ తరువాత విశాఖపట్నంలో చిన్న వాల్తేరు లో పట్టణ ఆరోగ్య కేంద్రంలో.నిర్మల సీతారామన్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని పరిశీలించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె దేశంలో 50 కోట్ల మందికి వాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని, కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు.ఎటువంటి భారం ఎవరు భయపడకుండా మొత్తం కేంద్రమే భరిస్తుందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube