జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఇటీవల ప్రారంభమైన విశ్వ క్రీడా సంబురంలో క్రీడాకారులు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు.భారత్ తరఫున పలు క్రీడాంశాల్లో ఆడుతున్న ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.
మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా బోర్గోహైన్, రవి కుమ్ దహియా భారత్‌కు పతకాలు సాధించారు.భారత్‌కు మరిన్ని పతకాలు తీసుకురావాలని క్రీడాకారులను భారతీయులు కోరుతున్నారు.
కాగా, ఈ సారి గోల్ఫ్‌లోనూ సిల్వర్ లేదా బ్రాంజ్ మెడల్ వచ్చే అవకాశాలున్నట్లు పలువురు క్రీడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో వివిధ దేశాల నుంచి క్రీడాకారులు బరిలో ఉన్నారు.గోల్ఫ్ క్రీడాంశంలో భారత్ తరఫున అదితి అశోక్ ఆడుతోంది.ఇప్పటికే ఈ ఆటలో బెటర్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకుంటోంది.
ఈ స్పోర్ట్‌లో వివిధ దేశాలనుంచి 60 మంది బరిలో నిలిచారు.తమ దేశం తరఫున పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలో ఆటలో మూడో రౌండ్ ముగిసే సరికి అదితి అశోక్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో రెండో స్థానంలో నిలిచింది.ఇక గేమ్‌లో కీలకమైన రౌండ్ రేపు ఉంటుంది.
కాగా, ప్రస్తుతం టోక్యోలో ఎన్విరాన్‌మెంట్‌లో చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి.కొన్ని ఏరియాల్లో ఎండలు దంచి కొడుతుంటే.
మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఒక వేళ రేపు గోల్ఫ్ జరిగే ప్రాంతంలో రెయిన్ పడితే.
గోల్ఫ్ నాలుగో రౌండ్‌పై ప్రభావం ఉంటుంది.ఈ నేపథ్యంలోనే మూడో రౌండ్ వరకు ఉన్న పర్ఫార్మెన్స్ ఆధారం చేసుకుని రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు.
అదే జరిగితే థర్డ్ రౌండ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న భారత్‌కు అనగా అదితికి రజత పతకం ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇండియన్స్ రేపు టోక్యోలో వాన పడాలని కోరకుంటున్నారు చూడాలి మరి ఏమవుతుందో.