పవిత్ర బంధం.తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ.
వెంకటేష్, సౌందర్య సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా.నిజానికి ఈ సినిమాలో వీరిద్దరు అనుకోకుండా నటించారు.
ఈ సినిమా కారణంగానే టాలీవుడ్ లో బెస్ట్ జోడీగా నిలిచిపోయారు.వెంకటేష్ తో సినిమా చేయాలని నిర్మాతలు శివరాజు, వెంకట్రాజు భావిస్తున్నారు.
వారు పలు మార్లు సురేష్ బాబును కలిశారు.ఒకరోజు తను సరే చెప్పాడు.
సుబ్బయ్యను దర్శకుడిగా మాట్లాడండి.వెంకటేష్ డేట్స్ ఇస్తామని చెప్పాడు.
అంతేకాదు.శివరాజు, వెంకట్రాజు సుబ్బయ్యకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయడానికి అంగీకారం తీసుకున్నారు.
దర్శకుడు సుబ్బయ్యకు భూపతిరాజు మంచి మిత్రుడు.పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాం.
మంచి కథ ఇవ్వమని అడిగాడు.దీంతో భూపతిరాజు పవిత్రబంధం సినిమా కథ చెప్పాడు.
ఈ సినిమా పాయింట్ అందరికీ బాగా నచ్చింది.ఈ కథతో సినిమా చేస్తే మంచి హిట్ ఖాయం అనుకున్నాడు సుబ్బయ్య.
దర్శకుడికి ఈ సినిమా బాగా నచ్చినా.నిర్మాతలకు కథ అంతగా నచ్చలేదు.వెంకటేష్ కు ఈ లైన్ సూట్ కాదేమో అనుకున్నారు.అందుకే ఈ కథతో వేరే హీరోను పెట్టి సినిమా చేద్దాం.
వెంకటేష్ కోసం మరో ఫ్యామిలీ కథ చేయాలని చెప్పారు.అయితే సుబయ్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
ఈ కథ బాగుంది.కచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పాడు.
సుబ్బయ్య మాటను కాదనలేకపోయారు నిర్మాతలు.కథా రచయితలు స్టోరీని బాగా డెవలప్ చేశారు.
నిర్మాతలకు ఈ స్టోరీ లైన్ నచ్చకపోవడంతో సుబ్బయ్య.సురేష్ బాబుకు కథ చెప్పాడు.
వెంటనే ఓకే చెప్పాడు వెంకటేష్.

వెంకటేష్, సురేష్ బాబు నిర్ణయం పట్ల నిర్మాతలు ఆశ్చర్యపోయారు.వెంటనే ఆర్టిస్టులను ఎంపిక చేయడం మొదలు పెట్టారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రమ్యకృష్ణను ఓకే అనుకున్నారు.
కానీ సుబ్బయ్య మాత్రం సౌందర్యను తీసుకోవాలి అనుకున్నాడు.ఈ పాత్రకు తను అయితే బాగుంటుందని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలో రమ్య ప్లేస్ లో సౌందర్య వచ్చి చేరింది.అనుకోకుండా సౌందర్య- వెంకటేష్ కలిసి నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
సినిమా కూడా మంచి విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.