నాగార్జున హీరోగా దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమా కు సీక్వెల్ అన్నట్లుగా బంగార్రాజు సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బంగ్రాజు సినిమా చిత్రీకరణ కోసం నాగార్జున మరియు చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు.
బంగార్రాజు బార్యగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించబోతున్నట్లుగా అంతా అనుకుంటున్నారు.సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆమె నే నటించడం వల్ల ఇప్పుడు కూడా ఆమె నటిస్తుందని అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా ఆమె స్థానంలో ముద్దుగుమ్మ శ్రియ శరణ్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొందరు మాత్రం రమ్యకృష్ణ ఉంటుంది.అలాగే శ్రియ కూడా ఉంటుందని అంటున్నారు.రమ్యకృష్ణ పాత్రకు శ్రియ కోడలు వరుస అవుతుందని.
అంటే నాగార్జున కు కూడా ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.మొత్తానికి నాగార్జున మరియు నాగచైతన్యలకు జోడీగా శ్రియ మరియు కృతి శెట్టి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా ను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో నాగార్జున కు జోడీగా శ్రియ నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.
నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా బంగర్రాజు ఎంటర్ టైన్ చేస్తాడా చూడాలి.
ఈ సినిమా కోసం సుదీర్ఘ కాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందా అనేది చూడాలి.నాగార్జున ఈ సినిమా బాధ్యతను కృష్ణ కళ్యాణ్ కు అప్పగించాడు.
ఈ సినిమా తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను నాగార్జున చేస్తున్నాడు.