మళయాళ స్టార్ మోహన్ లాల్ ఎం చేసినా అదిరిపోతుంది.60 ప్లస్ ఏజ్ లో కూడా ఆయన ప్రయోగాలు చేస్తున్నారని చెప్పొచ్చు.సౌత్ లో ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఆయన ఒకరు.పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే మోహన్ లాల్ అరవై ఏళ్లు పై బడిన తర్వాత కూడా ప్రయోగాలు చేస్తున్నారు.
మళయాళంలో ప్రియదర్శన్, మోహన్ లాల్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో మోహన్ లాల్ బాక్సర్ గా కనిపిస్తారని తెలుస్తుంది.బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మోహన్ లాల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రయోగాలకు తానెప్పుడు రెడీ అన్నట్టు ఉండే మోహన్ లాల్ తన నెక్స్ట్ సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నారు.మోహన్ లాల్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు.
తెలుగులో ప్రత్యేక పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో బాక్సర్ గా అంటే మోహన్ లాల్ కమిట్మెంట్ ఎలాంటిదో అర్ధమవుతుంది.
ఆమధ్య ఓ సినిమా కోసం కుర్రాడిగా కూడా మారిన మోహన్ లాల్ ఇప్పుడు బాక్సర్ గా అదరగొట్టాలని చూస్తున్నారు.