మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే అభిమానులు ఆయన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.తన డ్యాన్సులతో చిరంజీవి కొత్త ఒరవడిని సృష్టించి మంచి పేరును సొంతం చేసుకున్నారు.
చిరంజీవి డ్యాన్స్ గురించి ప్రశంసలు కురిపించిన సెలబ్రిటీలు సైతం ఎంతోమంది ఉన్నారు.ఇతర హీరోల అభిమానులు సైతం చిరంజీవి డ్యాన్స్ ను మెచ్చుకుంటారు.
అయితే ఒక వ్యక్తి మాత్రం చిరంజీవి డ్యాన్స్ పై విమర్శలు చేశారు.
చిరంజీవి 5వ సినిమా షూటింగ్ టైమ్ లో ఒక పాటకు చిరంజీవి స్టెప్పులేయగా ఆ సినిమాకు మేనేజర్ అయిన వెంకన్న బాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉండగా చిరంజీవి తన డ్యాన్స్ ఎలా ఉందని ఆయనను అడిగారు.
అయితే వెంకన్న బాబు డ్యాన్సర్లు ఏం చేశారో నువ్వూ అలానే చేశానని నీకంటూ ప్రత్యేకత లేకపోతే అర్థం ఏం ఉంటుందని ప్రశ్నించారు.ఆ తర్వాత చిరంజీవి డ్యాన్స్ మాస్టర్లు చెప్పేదానికి అదనంగా చేయాలని అనుకున్నారు.

అప్పటినుంచి చిరంజీవి పాటను ఆస్వాదించి డ్యాన్స్ చేస్తున్నానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.ఆ తర్వాత చిరంజీవి తనదైన మార్క్ తో డ్యాన్సులు చేసి అభిమానులను ఉర్రూతలూగించడం గమనార్హం.ప్రస్తుతం ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్ మరోసారి చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన లాహే లాహే పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.