ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా ముంబై పోలీసులు శిల్పాశెట్టిని అరెస్ట్ చేయగా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను వెనుకేసుకొచ్చారు.
నా భర్త ఏ పాపం తెలియని అమాయకుడంటూ శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్లు చేశారు.పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేయగా కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
శిల్పాశెట్టి ఎరోటికాకు, పోర్న్ కు తేడా ఉందని ఈ రెండూ ఒకటి కాదని వెల్లడించారు.కుంద్రా యొక్క బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారని సమాచారం.కుంద్రాకు చెందిన ఏడున్నర కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ ద్వారా సంపాదించిన డబ్బులను ఆన్ లైన్ బెట్టింగ్ కోసం వినియోగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

యాప్ ను నిర్వహిస్తున్న వ్యక్తి రాజ్ కుంద్రా బావమరిది అని శిల్పాశెట్టి చెప్పినట్టు తెలుస్తోంది.వియాన్ సంస్థ నుంచి గతేడాది శిల్పాశెట్టి తప్పుకోవడానికి గల కారణాల గురించి కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.ఎరోటికా కంటెంట్ ప్రస్తుతం చాలా సైట్లలో లభ్యమవుతోందని అలా వీడియోలు తీయడం తప్పు కాదని శిల్పాశెట్టి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు సర్వర్ నుంచి డేటాను తొలగించిన వ్యక్తి గురించి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఫోరెన్సిక్ నిపుణులు తొలగించిన డేటాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టు భోగట్టా.మరోవైపు తనను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని రాజ్ కుంద్రా చెబుతున్నట్టు తెలుస్తోంది.
తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి వాంగ్మూలం తీసుకునే అధికారం మాత్రమే పోలీసులకు ఉందని రాజ్ కుంద్రా చెప్పారని భోగట్టా.రాజ్ కుంద్రా కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
.