ఏ సినిమాలను చూడాలో చెప్పండి అంటున్న డేవిడ్ భాయ్..!

తెలుగు ప్రేక్షకులందరికీ డేవిడ్ వార్నర్ అంటే ఎక్కడ లేని అభిమానం ఉంది.ఆస్ట్రేలియా టీమ్ లో డేవిడ్ వార్నర్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది.

 Dawid Warner, Movie, Latest Viral, Latest Flash, Viral Latest, Viral News, Socia-TeluguStop.com

బ్యాటింగ్ కి వార్నర్ దిగాడంటే చాలు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటారు.తన బ్యాట్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతుంటాడు.

ఐపిఎల్ లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం అందరికీ తెలిసిందే.అయితే ఈ డేవిడ్ వార్నర్ అటు ఆట ద్వారానే కాదు ఇంకా అనేక రకాల పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటారు.

డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంతో కూడిన వీడియోలు చేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉంటారు.అంతే కాదు ఆయన వీడియోలు అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాయి కూడా.

తనలోని సృజనాత్మకతను ఆ వీడియోల ద్వారా డేవిడ్ వార్నర్ బయట పెడుతుంటారు.కరోనా వల్ల లాక్ డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేసి పోస్టులు పెడుతూ అభిమానులను ఎంతగానో అలరించాడు.

Telugu Dawid, Latest Flash, Latest-Latest News - Telugu

టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు చేస్తూ అందర్నీ వినోదభరితం చేస్తున్నాడు.తాాజాగా ఆయన ఓ పోస్టు పెట్టారు.ఆనంద్‌, బ‌ద్లా, బాహుబ‌లి, బ‌ర్ఫీ, దంగ‌ల్‌, గ‌ల్లీ బోయ్, దేవ‌దాస్‌, దిల్‌వాలే దుల్హానియా లే జాయెంగే త‌దిత‌ర చిత్రాల‌కు సంబంధించిన ఐకాన్‌ల తో పోస్టులు పెట్టారు.ఆ ఫోటోలపై లాక్‌డౌన్‌, స్టే సేఫ్, స్టే హోమ్ అని కూడా క్యాప్ష‌న్ ఇవ్వడంతో అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

ఆ పోస్టుర్లు పెట్టిన తర్వాత అందులో ఏ సినిమా చూడాలంటూ భారత అభిమానులను ఆయన ప్రశ్నలు సంధించారు.ఆయన అలా పోస్టు చేయడంతో చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

తెలుగు సినిమాలైన అల వైకుంఠ‌పురంలో, వ‌కీల్ సాబ్‌, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ త‌దిత‌ర సినిమాల‌ను చూడాలని హైద‌రాబాద్ వాసులు సూచించడంతో మరింత మంది కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube