హుజురాబాద్ ఉప ఎన్నికపై క్లారిటీ.. ఎప్పుడంటే?

అధికార టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్​ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది.హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అధికార టీఆర్​ఎస్​ బీజేపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

 Clarity On Hujurabad Constituency Bypoll When, Huzurabad By Poll, August Month-TeluguStop.com

ఈ నెల 15 తర్వాత హుజురాబాద్​ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉన్నట్లు టీఆర్​ఎస్​ వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఆగస్టులో ఈ ఉప ఎన్నికను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్​ నియోజకవర్గంతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న సుమారు 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.ఇప్పటికే హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం వెలువడాల్సిన నోటిఫికేషన్​ కరోనా కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇక హుజురాబాద్​ పోటీకి సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ అలర్ట్​ అయ్యాయి.మొన్నటి వరకు పోటీలో లేని కాంగ్రెస్​ కూడా ప్రస్తుతం రేవంత్​ రెడ్డికి టీపీసీసీ అప్పగించడంతో లైమ్ లైట్​ లోకి వచ్చింది.

త్వరలో బీజేపీ నేత బండి సంజయ్​ పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించడంతో హుజురాబాద్​ రాజకీయాలు వేడెక్కాయి.ఇన్నాళ్లు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్​ క్యాడర్​ కూడా రేవంత్​ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంతో ఎక్కడ లేని ఉత్సాహంతో పోటీకి సిద్ధమవుతోంది.

కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ల అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.

Telugu August, Bandi Sanjay, Central, Huzurabad, Krishna, Revanth Reddy, Ts-Telu

కాగా ప్రస్తుతం జరుగుతున్న జలజగడాలతో ఏమైనా నష్టం వాటిల్లుతుందా… అని అధికార టీఆర్​ఎస్​ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్​ ను రగిల్చి దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవాలని టీఆర్​ఎస్​ చూస్తోందట.నిన్న మొన్నటి వరకు అక్టోబర్​ లోనే హుజురాబాద్​ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయని భావించిన పార్టీలు ప్రస్తుతం ఆగస్టులోనే ఈ ఎన్నికలు జరుగుతాయని నమ్ముతున్నారు.

ఎన్నికల్లో

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube