ఒకప్పటి సినీనటి భానుమతి.నటిగానే కాకుండా నిర్మాతగా,దర్శకురాలిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నో సినిమాలలో నటించి, దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమెకు భరణి స్టూడియో అనే సొంతం నిర్మాణ సంస్థ ఉంది.
అందులోనే ఎన్నో సినిమాలను నిర్మించింది.ఇక తను మొదట దర్శకత్వం వహించిన ‘భక్త ధ్రువ మార్కండేయ‘ సినిమాకు ఎంతో మంది బాల నటులను పరిచయం చేయగా ఈ సినిమాలో సునీత అనే పాత్రలో పరిచయం చేసిన ఈ బాల నటిని గుర్తుపట్టారా.
ఇప్పటికీ తన నాట్యంతో అందరి మనసులను దోచుకున్న నటి.ఎవరో కాదు.
ఒకప్పటి హీరోయిన్.నాట్యంలో, నటనలో ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణి ల మేనకోడలే శోభన.ఇక ఈ ఫోటోలో బాలనటిగా ఉన్న శోభన ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఈ సినిమాతోనే తొలిసారిగా బాలనటిగా పరిచయం అయింది.
ఈ సినిమా చేస్తున్న సమయంలో శోభన చిత్ర స్వామినాథన్ దగ్గర నాట్యంలో శిక్షణ పొందుతుంది.తన అందంతో, నటనకు శోభన మంచి పేరు సంపాదించుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది.ఇక తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.నాట్యం లో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది శోభన.
హీరోయిన్ గా తొలిసారి విక్రమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శోభన ఆ తర్వాత పలు సినిమాలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు వంటి పలు స్టార్ హీరోలతో నటించింది.
ఇక ఈమె 1994లో కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసి అందులో భరతనాట్యంలో శిక్షణ, నృత్య వార్షికోత్సవాలు నిర్వహిస్తుంది.ఇక ఇప్పటికీ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.తన నృత్యాలతో బాగా ఆకట్టుకుంటుంది.
అంతే కాకుండా ఎంతో మందికి శిక్షణ కూడా ఇస్తుంది శోభన.