చదువు రాని వాళ్ళని చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు.వాళ్ళకేమి చేతకాదు అనే భావనలో ఉంటారు.
పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ, కొత్త వస్తువులను కనిపెడతారని అనే భావనలో ఉంటారు.కానీ చదువు లేని వాళ్ళు కూడా తాము అనుకున్నది సాధించి చూపించగలం అనే సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి కూడా సముద్రంలో ఎగిరే ప్లేన్ తయారు చేసాడు.ఈ సీ ప్లేన్ ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి.
అసలు వివరాల్లోకి వెళితే.అస్సాం రాష్ట్రంలోని జోర్హత్ జిల్లాకి చెందిన బాబుల్ సాయ్ కియా అనే వ్యక్తి అస్సాంలో మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు.
అయితే, బాబుల్ కి చిన్నపటి నుంచి గాలిలో ఎగరాలని కోరిక ఉండేదట.
ఆ సంకల్ప బలంతోనే బాబుల్ తన బజాజ్ పల్సర్ 200 సీసీ బైక్ ఇంజిన్ ను ఉపయోగించాడు బాబుల్ బైక్ ఇంజిన్ తో నీటిపై నుంచే టేకాఫ్, ల్యాండింగ్ అవ్వగలిగే ‘సీ ప్లేన్’ ని తయారుచేశాడు.
అంతేకాకుండా ఆ ప్లేన్ ను స్వయంగా అతనే నడిపి చూపించాడు.అయితే ఈ ప్లేన్ తయారుచేయడం అంత సులువుగా జరగలేదట.చాలా సమస్యలే ఎదుర్కొన్నానని, ఎన్ని సమస్యలు వచ్చిన తన ప్రయత్నాన్ని మాత్రం బాబుల్ ఆపలేదు.ఒకపక్క మేస్త్రీ పనిని కొనసాగిస్తూ, డబ్బు సంపాదిస్తూనే కాళీ సమయంలో ప్లేన్ తయారుచేయడానికి ప్రయత్నించేవాడు బాబుల్.
తనకు వచ్చే సంపాదనే అంతంత మాత్రం అయిన గాని ఆ సంపాదనలోంచి ఈ ప్లేన్ తయారీకి రెండు లక్షల రూపాయలను కేటాయించాడు.
అలా 2 లక్షల ఖర్చు, రెండు సంవత్సరాల శ్రమతో ఈ సీ ప్లేన్ సిద్ధమైంది.ప్లేన్ కి సంబంధించిన ప్రతి భాగాన్ని అతడే సొంతంగా తయారుచేసాడట.ఈ సీ ప్లేన్ పై ట్రయల్ వేసిన బాబుల్ తన ట్రయల్ లో ఎలాంటి లోపాలు కనిపించలేదని చెప్పారు.
దీనిని పూర్తిగా తయారు చేయడానికి మరి కొంత కాలం పడుతుందని, ఇకనుండి దీని కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తానని చెప్పుకొచ్చాడు.నేను ఈ ప్లేన్ లో ట్రయల్ వేసే సమయంలో నీటి మీద నుంచి ప్లేన్ పైకి దూసుకువెళ్తున్నప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
నా రెండేళ్ల శ్రమ, కష్టం అన్నీ మరిచిపోయానని చెప్పుకొచ్చాడు.సంకల్ప బలం ముందు ఎటువంటి పని అయిన చిన్నదే అని చెప్పడానికి బాబుల్ ఒక ఉదాహరణ.