డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా హీరోయిన్ల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.సినిమా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటే తనకు నచ్చదని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.
హీరోయిన్లు దేవతలతో సమానమని కోటిమందిలో ఒక్కరికి మాత్రమే హీరోయిన్ అయ్యే అవకాశం లభిస్తుందని పూరీ జగన్నాథ్ అన్నారు.అందువల్ల హీరోయిన్లు ఎంతో ప్రత్యేకం అని పూరీ జగన్నాథ్ తెలిపారు.
ఫ్యాన్స్ హీరోయిన్లను దేవతలలా భావిస్తారని నిజమైన దేవతలు పిల్లలను కనలేదని హీరోయిన్ల లాంటి దేవతలు పురిటినొప్పులు పడితే తాను చూడలేనని పూరీ జగన్నాథ్ తెలిపారు.మనుషులకు మాత్రమే పిల్లలను కనాలనే కోరిక ఉంటుందని దేవతలకు ఉండదని అందువల్ల హీరోయిన్లు పెళ్లికి దూరంగా దేవతల్లా ఉంటేనే తాను ఇష్టపడతానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
హీరోయిన్లు ఇతర అమ్మాయిలతో పోలిస్తే ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారని పూరీ పేర్కొన్నారు.
ప్రేమ లేకపోతే చనిపోతారా అంటూ పూరీ జగన్నాథ్ హీరోయిన్లను ప్రశ్నించారు.
పురాణాలలో కూడా పెళ్లి చేసుకోని మహిళలు ఎంతోమంది ఉన్నారని హాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుండా ఉండే సూపర్ స్టార్లు ఎంతోమంది ఉన్నారని పూరీ జగన్నాథ్ తెలిపారు.దేవతలలా హీరోయిన్లు ఆలోచిస్తే మంచిదని హీరోయిన్లతో పాటు ధైర్యంగా ఉన్న ప్రతి మహిళ దేవతలా మారాలని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
మహిళను తాళిబొట్టును మరిచిపోవాలని పూరీజగన్నాథ్ వెల్లడించారు.బలమైన మహిళలకు మాత్రమే దేశాన్ని మార్చగల సామర్థ్యం ఉంటుందని మీరు స్ట్రాంగ్ ఉమెన్ అని భావిస్తే పెళ్లి చేసుకోకుండా ఉండాలని పూరీ తెలిపారు.పూరీ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహిళలను పెళ్లి చేసుకోవద్దని సూచనలు చేస్తున్న పూరీ జగన్నాథ్ ఎందుకు పెళ్లి చేసుకున్నారని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
మరి ఈ ప్రశ్నకు పూరీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.