కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిచింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ బులెటిన్ లో ఈ ఆర్ధిక సంవత్సరం సుమారుగా 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది.
కరోనా వల్ల పట్టణాలు, గ్రామాలు కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నాయని తెలిపింది.వైరస్ ప్రభావం గామాల్లో కూడా వ్యాపించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
దేశ ఆర్ధిక వ్యవస్థ దీని నుండి కోలుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
వారి ఆర్ధిక స్థితిగతులు తారుమారవడంతో ఆ ఎఫెక్ట్ ఆర్ధిక వ్యవస్థ మీద పడ్డాది.దానితో పాటుగా కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ విధించడం కూడా ఆర్ధిక వ్యవస్థకు భంగం కలిగేలా చేసింది.
ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్ లో ఆర్ధిక వ్యవస్థ స్థితి, దిగుబడులు అంశాల గురించి తెలిపారు.అయితే గత సంవత్సరంతో పోల్చితే సెకండ్ వేవ్ లో కాటాక్ట్ లెస్ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్టు ఆర్బీఐ చెప్పింది.
ఇక దీన్ని రికవరీ చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని.దాని వల్ల ఆర్ధిక వ్యవస్థ ఈ లోటు నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.2019 రెండో త్రైమాసికం నుండి భారత్ దేశ దిగుబడి దిగజారిందని చెప్పింది.మళ్లీ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవాలంటే మాత్రం కరోనా వ్యాప్తి ఇంతటితో ఆగిపోతేనే అది కుదురుతుంది.