తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి.అక్కడ గెలిచేందుకు ఈటల రాజేందర్, టీఆర్ ఎస్ మంత్రులు జోరుమీద రాజకీయాలు చేస్తున్నారు.
ఇక ఈ ఉప ఎన్నికను టీఆర్ ఎస్ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఎలాగైనా గెలిచి పార్టీ పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
ఈటల లాంటి నాయకులు లేకపోయినా తమ పార్టీకి తిరుగులేదని కేసీఆర్ నిరూపించుకోవాలని చూస్తున్నారు.
ఇందుకోసం కేసీఆర్ మొదటి నుంచి హుజూరాబాద్ కోసం ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు.
స్వయంగా ఆయనే దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు.ఇందులో మరీ ముఖ్యంగా ఈటలకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న హరీశ్‌రావు లాంటి ట్రబుల్ షూటర్ భుజాలపై బాధ్యత పెట్టారు కేసీఆర్.
ఇందుకు సంబంధించిన పనులను ఇప్పటికే వేగవంతం చేస్తున్నారు.
హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోని రాజకీయాల్లో జోరుగా పనిచేస్తున్నారు.
మండలాలు, కులాలు, సంఘాలు, వర్గాల వారీగా మీటింగులు పెడుతూ వరాలు ప్రకటిస్తున్నారు.

మంత్రి హరీశ్ రావు వీటన్నింటికీ ఇన్‌చార్జిగా ఉంటూ ఈటలకు చెక్ పెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు.ఇక హుజూరాబాద్ ప్రజలకు ఏది కావాలన్నా వెంటనే ఇస్తున్నారు టీఆర్ ఎస్ నాయకులు.పిఛన్ నుంచి కొత్త రేషన్‌కార్డు కావాల వరకు రాష్ట్రంలో ఇవ్వకున్నా.
హుజూరాబాద్‌లో మాత్రం ఇస్తున్నారు.
రోడ్లు కావాలన్నా వెంట వెంటనే టెండర్లు పిలిచి సాంక్షన్ చేయిస్తూ పట్టు నిలుపుకుంటున్నారు.

ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మరీ స్పెషల్ కేటగిరీ కింద అభివృద్ధి పనులు చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.మరి అభ్యర్థి ఎవరో తెలియదు గానీ టీఆర్ ఎస్ మాత్రం పక్కాగా పావులు కదుపుతోంది.మరి వీటిని ఈటల ఎలా ఎదుర్కొంటారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.ఇప్పటికే ఆయన కూడా ఊర్లల్లో పర్యటనలు చేస్తూ తన మనుషులను దగ్గరకు తీసుకుంటున్నారు.చూడాలి మరి ఎవరు గెలుస్తారో త్వరలో వచ్చే ఉప ఎన్నికలో.