ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం కడతేర్చటానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.కాగా తాజాగా ఒక వివాహిత తన భర్త చేసే ఆగడాలను భరించలేక చివరికి తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో సంధ్య (పేరు మార్చాం) అనే వివాహిత తన భర్తతో కలిసి నివాసముంటోంది.అయితే సంధ్య భర్త సతీష్ స్థానిక నగరంలో జాబ్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో సతీష్ ఉద్యోగాల నిమిత్తమై వచ్చేటువంటి యువతులను మరియు భర్తలేని ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ వారితో సరసాలు సాగించేవాడు.కాగా ఇటీవలే ఈ విషయం గురించి తన భార్య సంధ్యకి తెలియడంతో ఈ విషయం గురించి నిలదీసింది.
అయినప్పటికీ సతీష్ తన ప్రవర్తనను మార్చుకోక పోవడంతో సంధ్య తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.కొన్ని రోజుల తర్వాత ఈ విషయం గురించి సతీష్ కి తెలియడంతో పలుమార్లు వీరిద్దరూ మధ్య గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో సతీష్ అప్పుడప్పుడు ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్య సంధ్య ని చితకబాదేవాడు.దీంతో దెబ్బలు తాళలేక సంధ్య తన భర్తను హత్య చేయాలని పన్నాగం పన్నింది.ఈ పన్నాగంలో భాగంగా తన ప్రియుడితో కలిసి సతీష్ ని హత్య చేసింది.అనంతరం ఏమి ఎరగనట్లు పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సంధ్య ని అదుపులోకి తీసుకొని విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తామిద్దరూ కలిసి సతీష్ ని హతమార్చినట్లు నేరం అంగీకరించింది.