ఈ మధ్య కాలంలో కొందరు మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయి చేసేటటువంటి పనుల కారణంగా ఇతరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా ఇంట్లో ఉక్క పోతగా ఉందని ఆరు బయట నిద్రిస్తున్న తల్లి కూతుర్లపై దారుణంగా కొందరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఒరాడాబాడ్ జిల్లా పరిసర ప్రాంతంలో “రంజిత్” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.కాగా ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికేటువంటి చిన్న చిన్న పనులను చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
కాగా వేసవి కారణంగా ఇంట్లో ఉక్క పోతగా ఉండటంతో ఆరుబయట తన భార్య, కూతురుతో కలిసి నిద్రించారు.దీంతో కొందరు యువకులు రివాల్వర్ తో బెదిరించి ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా 12 సంవత్సరాలు కలిగిన మైనర్ బాలికపై మరియు రంజిత్ భార్యపై దారుణంగా అత్యాచారం చేశారు.
అంతేకాకుండా ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే కాల్చి చంపేస్తామని బెదిరించారు.దీంతో బాధితులు ఈ విషయం గురించి కిక్కురుమనకుండా ఉండిపోయారు.

కానీ తన బంధువుల సహాయంతో ఇటీవలే స్థానిక ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారీలో ఉన్నారు.కానీ ఇటీవలే అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులలో ఒకరు పోలీసులకు దొరికాడు.దీంతో పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని విచారించగా మద్యం మత్తులో తామే ఈ నేరానికి పాల్పడినట్లు నేరం అంగీకరించారు.
దీంతో మిగిలిన నేరస్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు
.