Rice Porridge : పాతికేళ్లకే ముఖంపై ముడతలా.. అన్నం గంజితో ఈజీగా వదిలించుకోండిలా!

వయసు పైబడే కొద్దీ చర్మంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.ముఖ్యంగా కండరాలు పటుత్వాన్ని కోల్పోయి ముడతలు రావడం అత్యంత సర్వసాధారణం.

 How To Get Rid Of Wrinkles With Rice Porridge-TeluguStop.com

కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది పాతికేళ్లకే ముడతలు( Wrinkles ) సమస్యను ఎదుర్కొంటున్నారు.మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఎండల్లో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, పొల్యూషన్, అనారోగ్యమైన జీవనశైలి తదితర కారణాల వల్ల ముఖంపై ముడతలు ఏర్పడుతూ ఉంటాయి.

దీంతో తక్కువ వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు.

అద్దంలో ముఖాన్ని చూసుకునేందుకు కూడా ఇష్టపడరు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో ముడతలను మాయం చేయవచ్చు.మళ్లీ యవ్వనంగా మెరిసిపోవచ్చు.ముఖ్యంగా అందుకు అన్నం గంజి( Rice porridge ) చాలా బాగా సహాయపడుతుంది.సాధారణంగా అన్నం గంజిని అందరూ బయట పారబోస్తుంటాము.

కానీ అన్నం గంజిలో‌ ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.ప్ర‌ధానంగా ముడుతలు వదిలించడానికి గంజి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

మరి ఇంతకీ గంజిని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Face, Ridwrinkles, Latest, Porridge, Skin Care, Skin Care Tips, Wri

ముందుగా ఒక బౌల్‌ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అన్నం గంజిని వేసుకోవాలి.అలాగే ఒక ఎగ్ వైట్ ( Egg white )ను వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని మరో 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Face, Ridwrinkles, Latest, Porridge, Skin Care, Skin Care Tips, Wri

ప్రతిరోజు ఈ రెమెడీని కనుక పాటించారంటే ముఖంపై ఎలాంటి ముడతలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.అలాగే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.సన్నని గీతలు ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.చర్మం మళ్లీ యవ్వనంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.కాబట్టి చిన్న వయసులోనే ముడతలతో బాధపడుతున్న వారు అన్నం గంజితో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని తప్పక ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube