కొందరు హీరోయిన్స్ స్టార్ హీరోల సరసన నటించిన కూడా తరవాత అంతా అవకాశాలు అందుకోలేక పోతున్నారు.అంతేకాకుండా వారు అందంగా ఉన్నా కూడా ఎందుకో కానీ అవకాశాలు పొందలేరు.
ఇప్పుడు ఓ హీరోయిన్ పరిస్థితి కూడా అలానే ఏర్పడింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు వెంకీ సరసన నటించిన రితికా సింగ్.

2017 సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గురు‘.ఈ సినిమాలో వెంకటేష్, రితికా సింగ్ నటీనటులు గా నటించారు.హిందీ సినిమా రీమేక్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత రితికా సింగ్ తెలుగులో మరో సినిమాలో నటించగా అంత సక్సెస్ అందుకోక పోవడంతో మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకోలేదు.
రితికా సింగ్ 2016లో తమిళ, హిందీ లో వరుస సినిమాలతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత తమిళంలోనే పలు సినిమాలలో నటించింది.కాని తెలుగులో మాత్రం అవకాశాలు అందుకోలేదు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది రితికా సింగ్.ఎప్పటికప్పుడు తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంటుంది.

ఇక తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఎంతో హాట్ గా కనిపిస్తుంది.పైగా తన గ్లామర్ కూడా మరింత పెంచింది.ఇక ఈమె ఫోటో చూసిన నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఎంతో అందంగా ఉందంటూ బాగా పొగుడుతున్నారు.నిజానికి ఇంత ముద్దుగా ఉన్న రితికా సింగ్ కు టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు రావట్లేవని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉంది.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగులు వాయిదా పడటంతో లాక్ డౌన్ తర్వాత ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.