కర్ణాటకలో లాక్ డౌన్ పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కర్ణాటకలో అధికంగా ఉంది.రోజు రోజుకి కేసులు పెరుగుతున్నయి ఈ క్రమంలో కర్ణాటకలో లాక్ డౌన్ విధించారు.

 Lockdown Extends Till June 14 In Karnataka,karnataka, Lockdown, Covid Cases, Kar-TeluguStop.com

మే 24 నుండి కఠినమైన నిబంధనలు పెట్టింది.జూన్ 7 వరకు లాక్ డౌన్ ప్రకటించింది.

అయితే కేసులు తగ్గుముఖం పట్టని కారణంగా లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక సిఎం యడియూరప్ప.రాష్ట్రంలో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని.

సెకండ్ వేవ్ తీవ్రత గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించిందని అందుకే లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు చెప్పారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమావేశమైన యడియూరప్ప పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ పొడిగించారు.

జూన్ 14 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే ఉంటాయని ఆయన అన్నారు.కేసులు తగ్గించేందుకే జూన్ 7 వరకు ఉన్న లాక్ డౌన్ ను 14 వరకు పెంచామని అనారు.

కరోనా కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు 30వేల మరణాలు జరిగాయి.బుధవారం రాష్ట్రంలో 463 మంది కరోనాతో మృతి చెందారు.

కొత్తగా 16387 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 2635122 కగా రాష్ట్రంలో 293024 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 కేసులు తగ్గించేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని సిఎం యడియూరప్ప కర్ణాటక లాక్ డౌన్ ను పొడిగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube