వ్యాక్సిన్ల కొరత పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. ?

దేశంలో కరోనా ఎంతటి సమస్యను సృష్టిస్తుందో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ షాటేజ్ కూడా అంతే సమస్యకు మూలకారణం అవుతుంది.ఎందుకో కానీ పుంఖాలు పుంఖాలుగా స్పీచ్‌లు దంచే రాజకీయ నేతలు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇంకా కనుగొనలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట.

 Union Minister Made Interesting Remarks On Shortage Of Vaccines, Union Minister,-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ టీకా కొరత విషయంలో కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై కేంద్ర పెద్దలు విరుచుకు పడటం వరకే సమయం సరిపోతుంది.ఇక ప్రజల కోసం ఆలోచించే సమయం పాపం రాజకీయ నేతలకు చిక్కడం లేదట.

ఇక ప్రస్తుతం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీకాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు వెళుతోందని తెలుపుతూనే కోర్టు ఆదేశించినట్లుగా సకాలంలో టీకాలు అందజేయలేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారు ఉరి వేసుకోవాలా అని ప్రశ్నించారు.

కాగా కోవిడ్ చర్యల విషయంలో కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తున్న నేపధ్యంలో మంత్రి సదానంద గౌడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో అర్ధం ఏంటో అని ఆలోచిస్తున్నారట కొందరు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube