వయసు పైబడే కొద్ది వైట్ హెయిర్ రావడం సర్వ సాధారణం.కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్నవయసులోనే వైట్ హెయిర్ సమస్య బారిన పడుతున్నారు.
ఇందుకు కారణాలు అనేకం అయినప్పటికీ తెల్ల జుట్టు అనేది మన లుక్స్ ను పాడుచేస్తుంది.ముసలి వారిలా కనిపించేలా చేస్తుంది.
అందుకే వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.ఇలాంటి ఇబ్బందులు మీరు పడకూడదన్న.
వైట్ హెయిర్ ( White hair )కు దూరంగా ఉండాలనుకుంటున్న.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.]

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు, ఒక కప్పు వెల్లుల్లి తొక్కలు వేసుకోండి.అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreeks ) వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Clove ) వేసి వేయించుకోవాలి.ఆల్మోస్ట్ డార్క్ బ్లాక్ కలర్ వచ్చేంతవరకు వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పదార్థాలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.అనంతరం ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.
దాంతో తెల్ల జుట్టు సమస్య ( White hair problem )బారిన త్వరగా పడకుండా ఉంటారు.ఈ రెమెడీ వల్ల మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.
కాబట్టి వైట్ హెయిర్ కు దూరంగా ఉండాలని భావిస్తున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటిస్తూ ఉండండి.







