సిఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారుకి అందజేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: లబ్ధిదారు ఇంటికి స్వయంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామంలో శనివారం లబ్ధిదారులైన స్వర్ణలత అనే మహిళకు సహాయ నిధి చెక్కును ఇంటికి వెళ్లి స్వయంగా అందజేసి బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వసనీయతను చాటి చెప్పారు.

 Siricilla Brs Thota Agaiah Presented Cmrf Cheques,rajanna Siricilla ,brs, Thota-TeluguStop.com

ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి కారు గుర్తుపై ఓటు వేసి హైట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అదేవిధంగా అత్యధిక మెజారిటీతో కేటీఆర్ ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాజు అజ్మీరా నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అందే సుభాష్,మోహన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube