ప్రపంచ క్రికెట్లో విధ్వంసకరమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అని అడిగితే ఎక్కువ సమాధానం వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్.ప్రపంచ క్రికెట్ కి వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించి చాలా సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ అలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ లేడంటే అతిశయోక్తి కాదు.
వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వివిధ టీమ్స్ కు మెంటర్ గా పని చేస్తూనే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.ప్రపంచ క్రికెట్ లో జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనదైన మార్క్ స్టైల్ లో స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.
ఇకపోతే తాజాగా సోనీ టీవీలో ప్రసారమయ్యే కపిల్ శర్మ షో లో పలు విషయాలను చెప్పుకొచ్చాడు.దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరి ఫోన్లు వారు తీసుకొని వారు అందులో మునిగిపోతారని.
ఇదివరకు కాలంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రికెటర్లు అందరు ఒకచోట కూర్చుని చర్చించుకునే వారని చెప్పుకొచ్చాడు.ఈ కార్యక్రమంలో సెహ్వాగ్ ఇతర దేశాల క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.
శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో గానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అతి తక్కువగా మాట్లాడుతారు అంటూ తెలుపుతూ అందుకు గల కారణం అని తెలియజేశాడు.ఇంతకీ అసలు కారణం ఏంటంటే.
శ్రీలంక క్రికెటర్లలో సగం మందికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదని తెలియజేశారు.ఇక ఇంగ్లాండ్ క్రికెటర్ ల విషయానికి వస్తే వారు ప్రపంచంలో అపరిశుభ్రంగా ఉన్న క్రికెటర్లు అంటే వారే అంటూ తెలియజేశాడు.
దానికి కారణం వారు రోజుల తరబడి స్నానం చేయారని చెప్పుకొచ్చాడు.అయితే ఇందుకు గల కారణాలను కూడా తెలియ చేసాడు.
వాళ్ళ దేశంలో స్నానం తరచుగా చేయరు కాబట్టి వాళ్లకు అదే అలవాటుగా మారిందని చెప్పుకొచ్చాడు.
ఇక పాకిస్తాన్ క్రికెటర్ ల గురించి మాట్లాడుతూ.

పాకిస్థాన్ క్రికెటర్లు తిట్టిన బూతులు ఎవరు తిట్టుకొరు అని చెప్పుకొచ్చాడు.పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అని భయపడేవాడినని చెప్పుకొచ్చారు.ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ ల విషయానికి వస్తే వారికి కాస్త అమ్మాయిల పిచ్చి ఎక్కువని చెప్పుకొచ్చాడు.వెస్టిండీస్ క్రికెటర్ ల విషయానికి వస్తే.వారు చాలా మంచివారని అయితే వారికి పార్టీలు చేసుకోవడం అంటే తెగ ఇష్టం అని వివిధ దేశ క్రికెటర్ల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.